
Published on: May 30, 2021, 4:10 AM IST | Updated on: May 30, 2021, 5:55 AM IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు మానవతామూర్తులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కొవిడ్ బాధితులకు ఆహారం అందిస్తూ అండగా నిలుస్తున్నారు . లాక్‌డౌన్ వేళ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు పట్టెడన్న అందించే వారు కొందరైతే మరికొందరు నిత్యావసర సరుకులు పంపిణీతో ఆదుకుంటున్నారు . కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స కోసం తమవంతు సాయం చేస్తున్నారు.
కొవిడ్ విపత్తు వేళ బాధితులు, నిరుపేదలకు సాయం చేస్తూ దాతలు ఉదారత చాటుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నవారి కడుపు నింపుతున్నారు . మరికొందరు కొవిడ్ బారినపడినవారికి పక్కా వైద్యం అందేలా సహకరిస్తున్నారు . హైదరాబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్, ఆశా జ్యోతి, డాక్లర్స్ ఫర్ యూ సంక్షేమ సంఘాలు సంయుక్తంగా ప్రాజెక్టు బ్రీత్ వెల్ ఆధ్యర్యంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తాకు 7 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా అందజేశారు. వాటిని చిలకలగూడ రైల్వే ఆరోగ్య కేంద్రంలో వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఆరాంఘర్ సమీపంలోని మహమ్మదీయ మజీద్‌లో కరోనా బాధితుల కోసం 40 బెడ్లతో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ వారి సహకారంతో రోగులకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారు . హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి రేఖ పేదలకు అండగా నిలుస్తున్నారు. రేఖ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా రోజుకి దాదాపు వేయి మందికి అన్నదానం చేస్తున్నారు . ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం వితరణ చేస్తున్నారు.
More Info…